మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘గోవిందుడు అందరివాడేలే’. ఈ సినిమా మొత్తం రామ్ చరణ్ పోనీ టెయిల్ లుక్ లో కనిపించనున్నాడు. ఈ విషయాన్ని రామ్ చరణ్ చెప్పాడు.
అలాగే తన లుక్ పై కామెంట్స్ కూడా వస్తున్నాయని చరణ్ అంటున్నాడు. ‘పోనీ టెయిల్ లుక్ తెరపై చూసుకుంటే బాగుందనిపించింది. కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం కాస్త ఇబ్బంది పడుతున్నారు. మా అత్తమ్మ ఆ పిలక ఎప్పుడు తీసేస్తారు చరణ్ అని అడుగుతున్నారని’ చరణ్ చెప్పాడు.
కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం నానక్రాంగూడాలోని రామానాయుడు స్టూడియోస్ లో జరుగుతోంది. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.


