‘అంతక ముందు ఆ తరువాత’ సినిమా ద్వారా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ అశ్విన్ హీరోగా, ‘ప్రేమ కథాచిత్రమ్’ తో అందరినీ ఆకట్టుకున్న నందిత హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా ‘లవర్స్’. చిన్న సినిమాలను నిర్మించి మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ మారుతి సమర్పిస్తూ, స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందించిన ఈ సినిమాకి హరినాథ్ డైరెక్టర్. జూలై 4న బ్యూటిఫుల్ సమంత చేతుల మీదుగా ఈ సినిమా ఆడియో రిలీజ్ అయ్యింది. అలాగే ఈ చిత్ర ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఓ ఫ్యాన్సీ అమౌంట్ కి ఈ సినిమా నైజాం రైట్స్ ని దక్కించుకున్నారు. ఒక పెద్ద నిర్మాత ఇలాంటి చిన్న సినిమాలో భాగస్వామ్యం కావడం సినిమాకి చాలా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఆగష్టులో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా సెకండాఫ్ లో వచ్చే కమెడియన్ సప్తగిరి పాత్ర సినిమాకి హైలెట్ అవుతుందని ఈ చిత్ర టీం చెబుతోంది. సూర్యదేవర నాగ వంశీ – మహేంద్ర బాబు కలిసి నిర్మించిన ఈ సినిమాకి జెబి సంగీతం అందించాడు.


