‘బిర్యానీ’ తర్వాత ‘మాస్’ – వెంకట్ ప్రభు.

‘బిర్యానీ’ తర్వాత ‘మాస్’ – వెంకట్ ప్రభు.

Published on Jul 7, 2014 12:13 PM IST

venkat-prabhu
కింగ్ నాగార్జున, కొరియోగ్రాఫర్ కం డైరెక్టర్ రాఘవ లారెన్స్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘మాస్’ సినిమా సూపర్ సక్సెస్ సాదించింది. ఇప్పుడు ఇదే టైటిల్ తో మరో సినిమా తెరకెక్కనుంది. తమిళ స్టార్ హీరో సూర్య, దర్శకుడు వెంకట్ ప్రభు కాంబినేషన్లో రూపొందనున్న సినిమాకు ‘మాస్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. నయనతార, అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన సరోజ, గ్యాంబ్లర్ సినిమాలు తెలుగులో ప్రేక్షకాదరణను సొంతం చేసుకున్నాయి. సూర్య తమ్ముడు కార్తి హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన చివరి సినిమా ‘బిర్యానీ’ తెలుగులో డీసెంట్ హిట్ గా నిలిచింది. తమిళంతో పాటు తెలుగులో కూడా ‘మాస్’ సినిమాను విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు