చిరునవ్వుతో మహేష్ బాబు..

చిరునవ్వుతో మహేష్ బాబు..

Published on Jul 7, 2014 1:00 PM IST

mahesh-babu
సూపర్ స్టార్ మహేష్ బాబు, యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రాల స్పెషలిస్ట్ శ్రీను వైట్ల కాంబినేషన్లో రూపొండుతున్న తాజా చిత్రం ‘ఆగడు’. గత కొన్ని రోజులుగా బళ్ళారిలో జరుగుతున్న ‘ఆగడు’ షెడ్యూల్ ఆదివారంతో కంప్లీట్ అయ్యింది. నేటి(సోమవారం) నుండి హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది.

దుమ్ము, ధూళిని సైతం లెక్కచేయకుండా సినిమా యూనిట్ అందరూ బాగా కష్టపడ్డారు. ముఖ్యంగా ప్రతికూల పరిస్థితులలో సైతం మహేష్ బాబు ముఖంపై చిరునవ్వు మెయింటైన్ చేస్తూ.. ఎనర్జీని, గ్లామర్ ఎక్కడా కోల్పోకుండా మెయింటైన్ చేశారు అంటూ ట్విట్టర్లో దర్శకుడు శ్రీనువైట్ల పోస్ట్ చేశారు.

14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్. తమన్ సంగీతం అందిస్తున్నారు. శృతి హాసన్ స్పెషల్ సాంగ్ మరో ప్రత్యేకత.

తాజా వార్తలు