ప్రత్యేకం : హైదరాబాద్ కథలపై కన్నేసిన బాలీవుడ్..

ప్రత్యేకం : హైదరాబాద్ కథలపై కన్నేసిన బాలీవుడ్..

Published on Jul 8, 2014 10:19 AM IST

Hyderabad
ఒకప్పుడు హిందీ సినిమా కథా రచయితలు ఎక్కువగా నార్త్ ఇండియా నేపధ్యంలో కథలను రాసుకునేవారు. ప్రస్తుతం ట్రెండ్ మారింది. కొత్తదనం కోసం, వైవిధ్యం కోసం హైదరాబాద్ వైపు కన్నేస్తున్నారు. బాలీవుడ్ దర్శకనిర్మాతలు హైదరాబద్ నేపధ్యంలో నడిచే కధలకు చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు. తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమాలను రీమేక్ చేయడంతో పాటు తెలుగు నేటివిటీ కథలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.

విద్యా బాలన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘బాబీ జసూస్’లో హైదరాబాద్ నేటివిటీని ప్రతిభింబించింది. ‘హైదరాబద్ కా బిర్యానీ.. గండిపేట్ కా పాని’ అంటూ దక్కన్ హిందీలో హైదరాబద్ స్టైల్లో విద్యా బాలన్ చెప్పిన డైలాగులకు థియేటర్లలో చప్పట్లు కొట్టారు ప్రేక్షకులు. ‘బాబీ జసూస్’ సినిమాను హైదరాబాది అమ్మాయి దియా మీర్జా నిర్మించడం విశేషం. ‘బాబీ జసూస్’ తర్వాత ఆదిత్యా రాయ్ కపూర్, పరిణితి చోప్రా జంటగా రోపొందుతున్న ‘దావత్ ఎ ఇష్క్’ సినిమాలో హీరోయిన్ హైదరాబాది అమ్మాయిగా కనిపించనుంది. తాజాగా విడుదలైన ‘దావత్ ఎ ఇష్క్’ ట్రైలర్ హైదరాబాదిలను ఆకట్టుకుంది. ట్రైలర్లో చార్మినార్, ట్యాంక్ బండలను ఫోకస్ చేయడమే మెయిన్ రీజన్.

ఇటివల కాలంలో హైదరాబాద్ ప్రేక్షకులు హిందీ సినిమాలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. హిందీ సినిమాల వసూళ్లు(కలెక్షన్స్) బాగుండడంతో బాలీవుడ్ తారలు, దర్శకనిర్మాతలు హైదరాబాద్ మార్కెట్’పై కన్నేశారు. ఇక్కడ ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని హిందీ సినిమాలు హైదరాబాద్ నేపధ్యంలో రూపొందే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు