రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటో చెప్పిన డి. సురేష్ బాబు

రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటో చెప్పిన డి. సురేష్ బాబు

Published on Jul 8, 2014 12:49 PM IST

Suresh-Babu
టాలీవుడ్ సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం ‘బాహుబలి’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. రాజమౌళి తో ‘ఈగ’ లాంటి ట్రెండ్ సెట్టింగ్ మూవీ తీసిన టాప్ ప్రొడ్యూసర్ డి.సురేష్ బాబు రాజమౌళి యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటనేది చెప్పాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘రాజమౌళికి మాహాభారత ని హాలీవుడ్ లో రీమేక్ చేయాలనేది డ్రీమ్’ అని సురేష్ బాబు అన్నాడు. ప్రస్తుతం ఈ తరహా సినిమానే తీస్తున్న రాజమౌళి డ్రీమ్ కూడా త్వరలోనే నెరవేరాలని ఆశిద్దాం.

సురేష్ బాబు నిర్మించిన ‘దృశ్యం’ సినిమా జూలై 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంకటేష్ హీరోగా నటించిన ఈ సస్పెన్స్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో మీనా, కృతిక కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ ప్రియ దర్శకత్వం వహించిన ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని సురేష్ బాబు చాలా నమ్మకంగా ఉన్నాడు.

తాజా వార్తలు