
గబ్బర్ సింగ్, రామయ్యా వస్తావయ్యా చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, హైందవ ప్రచారకర్త శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామిజి వారిని కలిశారు. స్వామిజిని కలవడం పట్ల హరీష్ శంకర్ సంతోషం వ్యక్తం చేశారు. వీరి కలయిక అనుకోకుండా జరిగింది.
‘శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారితో కలసి ప్రయాణం చేయడం & మాట్లాడడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనతో మాట్లాడిన తర్వాత స్వామిజిపై గౌరవం మరింత పెరిగింది. భవిష్యత్లో స్వామిజి ప్రవచనలలో పాల్గొనడానికి ఎదురుచూస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.

