రవితేజ ‘పవర్’ మూవీ లేటెస్ట్ న్యూస్.

రవితేజ ‘పవర్’ మూవీ లేటెస్ట్ న్యూస్.

Published on Jul 9, 2014 1:30 PM IST

Power_raviteja1
మాస్ మహారాజ రవితేజ నటించిన ‘బలుపు’ సినిమా విడుదలై ఏడాది దాటింది. వరుస పరాజయాల తర్వాత వచ్చిన విజయంతో తర్వాత నటించబోయే సినిమాలపై మరింత శ్రద్ధ తీసుకోవడం ప్రారంభించారు రవితేజ. అందుకే ఈ ఏడాది పాటు మాస్ మహారాజ నటించిన మరో సినిమా విడుదల కాలేదు. ‘పవర్’ సినిమా అభిమానులకు విందు భోజనంలా ఉంటుందని యూనిట్ సభ్యులు అంటున్నారు.

‘బలుపు’ తర్వాత రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘పవర్’. రవితేజ పోలీస్ ఆఫీసర్’గా నటిస్తున్నారు. రవితేజ సరసన హన్సిక నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ బల్గేరియాలో జరుగుతుంది. రవితేజ, హన్సికల్పి అక్కడ అందమైన ప్రదేశాలలో సాంగ్ షూట్ చేస్తున్నారు. బలుపు కథారచయిత బాబీ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత. షూటింగ్ త్వరగా పూర్తి చేసి జూలై లేదా ఆగష్టులో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు