
‘యముడు’, ‘సింగం’ చిత్రాలతో తనకు మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన దర్శకుడు హరితో మరోసారి జత కట్టనున్నారు తమిళ స్టార్ హీరో సూర్య. తన తాజా సినిమా ‘అంజాన్’ యుట్యూబ్లో రికార్డు వ్యూస్ సాదించిన సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్’పైకి వెళ్లనుంది. ‘యముడు’, ‘సింగం’ చిత్రాలతో తర్వాత తెరకెక్కనున్న ఈ హట్రిక్ సినిమాపై అప్పుడే అంచనాలు ప్రారంభమయ్యాయి. ‘మనం’ చిత్ర దర్శకుడు విక్రమ్ తో కూడా సినిమా ఉంటుందని చెప్పారు.
ఇటివల సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ముఖ్య భూమిక పోషిస్తున్న సోషల్ మీడియాలోకి కూడా సూర్య రానున్నారు. పేస్ బుక్, ట్విట్టర్ లలో త్వరలో చేరనున్నట్టు తెలిపారు. బహుశా సూర్య పుట్టినరోజైన జూలై 23న సోషల్ మీడియాలో సూర్య ఎంటరయ్యే అవకాశాలు ఉన్నాయి.

