
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటిస్తున్న ‘గోవిందుడు అందరి వాడెలే’ టీజర్ కృష్ణవంశీ పుట్టినరోజున అయిన జూలై 28న విడుదల కానుంది. ఇప్పటికే రెడీ అయిన ఈ టీజర్ హీరో కి దర్శకుడి కి నచ్చగానే విడుదల చేస్తారు.
ఈ కుటుంబకధా చిత్రంలో రామ్ చరణ్ ఒక యెన్. ఆర్. ఐ పాత్ర పోషిస్తున్నాడు. కృష్ణవంశీ తన చిత్రాన్ని ఎంతో అందంగా చిత్రీకరిస్తాడు. చరణ్ తో పాటు తన అభిమానులు కూడా ఈ చిత్రం ద్వారా చరణ్ ఇమేజ్ మారుతుందని ఆశిస్తున్నారు. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజ సంగీతం అందిస్తున్నారు.
ఈ చిత్ర నిర్మాతైన బండ్ల గణేష్ ఈ చిత్రం ప్రోగ్రెస్ తో ఎంతో సంతోషంగా వున్నారు.

