
సూర్య హీరోగా నటించిన ‘సికిందర్’ సినిమా సీడెడ్ ఏరియాలో మంచి బిజినెస్ చేస్తుంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ మధు ఈ ఏరియాని 2.75 కోట్లకు సొంతం చేస్కున్నట్టు సమాచారం. ఒక అనువాద చిత్రానికి ఇంతమొత్తంలో ధర పలకడమంటే విశేషమే అని చెప్తున్నారు
ఈ సినిమా టీజర్ ద్వారా సూర్య మరో యాక్షన్ ఎంటర్టైనర్ ని అందిస్తున్నట్లు తెలుస్తుంది. సమంత ఈ చిత్రంలో కధానాయిక కావడం కూడా కలిసొచ్చే అంశం. సినిమాకు గ్లామర్ హంగులు అద్దడంలో సహాయపడుతుందని అంచనా
లింగుస్వామి ఈ సినిమాకి దర్శకుడు. సికిందర్ ఈ నెల 15న విడుదలకానుంది

