
ఇండో – కెనడియన్ పోర్న్ స్టార్, సెక్సీ సన్నీ లియోన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హిందీలో శృంగారబరితమైన చిత్రాలు ఒకవైపు, ఐటెం సాంగులతో మరోవైపు ప్రేక్షకులను తన మత్తులో ముంచేస్తుంది. సన్నీ నటించిన చిన్న వీడియో సాంగ్ అయినా యుట్యూబ్లో రికార్డులు క్రియేట్ చేస్తుంది. వారం క్రితం విడుదలైన సన్నీ లియోన్ పింక్ లిప్స్ పాట 18.7 లక్షల వ్యూస్ పొందింది. ఇంటర్నేషనల్ లెవెల్లో క్రేజ్ ఉన్న సన్నీ లియోన్ పాటకు ఈ రేంజ్లో రెస్పాన్స్ రావడంతో మీడియా అంతా సన్నీ గురించి వార్తలు ప్రసారం చేయడం మొదలుపెట్టాయి.
అయితే ఇక్కడ సౌత్ హీరో సూర్య సన్ని లియోన్ కి షాక్ ఇచ్చాడు. పింక్ లిప్స్ వీడియో సాంగ్ రిలీజ్ అయిన 3 రోజుల తర్వాత వచ్చిన ‘అంజాన్’ టీజర్ పింక్ లిప్స్ పాటను వెనక్కు నెట్టింది. ప్రస్తుతం ‘అంజాన్’ టీజర్ ను 17.5 లక్షల మంది యుట్యూబ్లో వీక్షించారు. కేవలం ఐదు రోజుల్లోనే ‘అంజాన్’ టీజర్ ఈ ఘనత సాదించింది. పింక్ లిప్స్ వీడియో సాంగ్’కు 5 రోజుల్లో వచ్చిన వ్యూస్’తో పోలిస్తే చాలా ఎక్కువ. సూర్య జోరు చూస్తుంటే త్వరలో సన్నీ లియోన్ పాటను వెనక్కు నెట్టే అవకాశాలు ఉన్నాయి. పింక్ లిప్స్ పాటకు 7వేల లైకులు వస్తే.. ‘అంజాన్’ టీజర్’కు 11వేల లైకులు వచ్చాయి.

