
గత కొన్ని రోజులుగా అందాల భామ కాజల్ అగర్వాల్ ‘గీతాంజలి’ సినిమాలో ఓ ఐటెం సాంగ్ చేయనుంది అనే వార్తలు బాగా ప్రచారంలో ఉన్నాయి. అలాగే చాలామంది ఈ పాట చేయడం కోసం కాజల్ కి భారీ అమౌంట్ కూడా ఇచ్చారని ప్రచారం చేస్తున్నారు.
కానీ కాజల్ అగర్వాల్ ఈ వార్తలని తన అఫీషియల్ ఫేస్ బొక్ అకౌంట్ ద్వారా కొట్టి పారేసింది. ‘నేను ఏ సినిమా కోసమూ స్పెషల్ సాంగ్ చేయడం లేదు. మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే నేను చెప్పేంత వరకూ మీరు చదివిన విషయలాను నమ్మకండి. ప్రస్తుతం నేను గోవిందుడు అందరివాడేలే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నానని’ కాజల్ తెలిపింది.
అలాగే కాజల్ కంటే ముందు ఈ స్పెషల్ సాంగ్ సమంత చేస్తుందని వార్తలు వచ్చాయి, కానీ తను కూడా ఈ సాంగ్ చేయడం లేదు. సమంత, కాజల్ అగర్వాల్ లు ఈ స్పెషల్ సాంగ్ రూమర్స్ ని కొట్టి పారేసాక తర్వాత ఈ పాట కోసం కోన వెంకట్ ఎవరిని ఎంచుకుంటాడా అనేది తేలాల్సి ఉంది.

