రజినీకాంత్ ‘లింగా’ కోసం స్పెషల్ డామ్ సెట్

రజినీకాంత్ ‘లింగా’ కోసం స్పెషల్ డామ్ సెట్

Published on Jul 11, 2014 9:15 AM IST

Rajinikanth

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న సినిమా ‘లింగా’. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ఓ స్పెషల్ డామ్ సెట్ వద్ద లింగా సినిమా షూటింగ్ జరుగుతోంది. అక్కడ విలన్ కి – హీరోకి మధ్య జరిగే కొన్ని హోరా హోరీ సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఈ సినిమాలో రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని ఇదివరకే తెలియజేశాం.

అలా ఈ రెండు పాత్రల్లో ఒక పాత్ర కథ ప్రస్తుతానికి సంబందించినది అయితే, మరొక పాత్ర కథ స్వాతంత్ర్యం రాకముందు జరుగుతుంది. స్వాతంత్ర్యం రాకముందు జరిగే కథలో రజినీ కాంత్ ఓ వజ్రాల దొంగగా కనిపించనున్నాడని సమాచారం. అలాగే అతను దొంగిలించే ఓ వజ్రం ఈ సినిమా కథలో ఓ కీలకమైన అంశం అని అంటున్నారు.

కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రజినీకాంత్ సరసన అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు