
సౌత్ లో సూపర్ హిట్టయిన సినిమాలను హిందీలో రీమేక్ చేస్తూ వరుసగా ఘన విజయాలను అందుకుంటున్న హీరో సల్మాన్ ఖాన్. గత 5 సంవత్సరాలలో సల్మాన్ కు హిట్ అందించిన సినిమాలన్నీ సౌత్ రీమేకులే కావడం విశేషం. వాంటెడ్, రెడీ, బాడీగార్డ్, కిక్ సినిమాల బాటలో మరో సినిమా హిందీలో రీమేక్ కానుందని సమాచారం. తెలుగు, తమిళ భాషలలో హిట్ అయిన అజిత్ ‘వీరుడోక్కడే’ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి సన్నహాలు జరుగుతున్నాయి.
‘వీరుడోక్కడే’ హిందీ రీమేక్ లో సల్మాన్ సోదరులు అర్భాజ్ ఖాన్, సోహైల్ ఖాన్ నటిస్తారని ప్రచారం జరుగుతుంది. అజిత్ సరసన తమన్నా నటించిన ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహించారు. హిందీలో కూడా శివను దర్శకత్వం చేయమని సల్మాన్ కోరారట. వచ్చే ఏడాది సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి.

