
‘పంజా’ సినిమాలో పవన్ కళ్యాణ్ ప్రేక్షకులకి గెడ్డంతో దర్శనమిచ్చాడు. ఆ సినిమా చివరికి ఫ్లాప్ గా నిలిచింది. అలా సినిమా అంతా గెడ్డంతో కనిపించడం పవన్ అభిమానులకు రుచించలేదు. దాదాపు టాలీవుడ్ లో ఏ పెద్ద హీరో సినిమా అంతా అంత గెడ్డంతో నటించలేదు
ఇప్పుడు ‘గోపాల గోపాల’ సినిమా కోసం పవన్ మరోసారి గెడ్డంతో నటించనున్నాడు అని సమాచారం. కృష్ణుని వేషం వేస్తున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు దీనిపై అభిమానులు కలవరపడుతున్నట్లు సమాచారం. పవన్ బయట కూడా తరచూ గెడ్డంతోనే కనిపిస్తున్నాడు
కాబట్టి ఇప్పటికి ఈ సినిమా హాట్ టాపిక్ ఏమిటంటే పవన్ గెడ్డంతో కనిపించానున్నాడా లేక క్లీన్ లుక్ తో అలరించనున్నాడా?? ఈ సినిమాకు డాలీ దర్శకుడు. వెంకటేష్ ప్రధాన పాత్రధారి

