తెలంగాణ బంద్ ఎఫెక్ట్ : ‘ఐస్ క్రీం’ ప్రదర్శన నిలిపివేత

తెలంగాణ బంద్ ఎఫెక్ట్ : ‘ఐస్ క్రీం’ ప్రదర్శన నిలిపివేత

Published on Jul 12, 2014 12:45 PM IST

ice
తెలంగాణ బంద్ ప్రభావం వలన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘ఐస్ క్రీం’ ప్రదర్శనను పలు చోట్ల నిలిపివేశారు. ఈ శుక్రవారం విడుదల కావలసిన ‘ఐస్ క్రీం’ సినిమా అనివార్య కారణాల వలన ఒక్క రోజు లేటుగా శనివారం(ఈ రోజు) విడుదల చేశారు. పార్లమెంట్ సమావేశాలలో పోలవరం ఆర్డినెన్సు జారీచేయడంతో ఆగ్రహం చెందిన తెలంగాణవాదులు బంద్ పిలుపును ఇచ్చారు. అందువల్ల ‘ఐస్ క్రీం’ ప్రదర్శన తెలంగాణలో నిలిచిపోయింది.

నవదీప్, తేజస్వి జంటగా నటించిన ఈ హారర్ థ్రిల్లర్ సినిమా కోసం రామ్ గోపాల్ వర్మ పలు పబ్లిసిటీ గిమ్మిక్కులు ప్రదర్శించారు. ఓపెనింగ్స్ కోసం విపరీతంగా హడావుడి చేశారు. ఇప్పుడవన్నీ బూడిదలో పోసిన పన్నీరు అయ్యాయి.

తాజా వార్తలు