రామ్ చరణ్ తండ్రి పాత్రలో రెహమాన్.. ?

రామ్ చరణ్ తండ్రి పాత్రలో రెహమాన్.. ?

Published on Jul 12, 2014 2:30 PM IST

ramcharan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశి కలయికలో తెరకెక్కుతున్న సినిమా ‘గోవిందుడు అందరివాడేలే’. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ తండ్రి పాత్రలో తమిళ నటుడు రేహమాన్ కనిపించనున్నారని సమాచారం. గతంలో ఈ పాత్ర కోసం జగపతి బాబుని సంప్రదించారని వార్తలు వచ్చాయి. అయితే చివరకు ఈ అవకాశం రేహమాన్ ను వరించిందట.

కుటుంబ అనుబందాలు, ఆప్యాతల నేపధ్యంలో తెరకెక్కుతున్న ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలో చరణ్ తాతయ్యగా ప్రకాష్ రాజ్, బాబాయిగా శ్రీకాంత్ నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్. జయసుధ, కమలినీ ముఖర్జీలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

ప్రేక్షకులలో భారి అంచనాలు నెలకొన్ని ఉన్న ఈ సినిమా టీజర్ జూలై 28న, దర్శకుడు కృష్ణవంశి పుట్టినరోజున విడుదల చేయనున్నారు. తాజాగా సినిమా సీడెడ్ పంపిణిహక్కులు రికార్డు ధరకు అమ్ముడయ్యాయి. అక్టోబర్ 1న విడుదల కానున్న ఈ సినిమా అభిమానులకు పండగ వాతావరణం తీసుకొస్తుందని నిర్మాత తెలిపారు.

తాజా వార్తలు