పైరసీపై విశాల్ పోరాటం..

పైరసీపై విశాల్ పోరాటం..

Published on Jul 12, 2014 10:10 PM IST

vishal
పైరసీ.. చలన చిత్ర పరిశ్రమను పట్టి పీడిస్తున్న భూతం. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ ఇలా ప్రతి చిత్ర పరిశ్రమ పైరసీ వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కుంటుంది. తెలుగులో ‘అత్తారింటికి దారేది’ చిత్రం విడుదలకు ముందే ఇంటర్నెట్లో ప్రత్యక్షం అయ్యింది. పైరసీపై పలువురు చిత్ర పరిశ్రమ ప్రముఖులు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. సైబర్ క్రైమ్ డిపార్టుమెంట్ పోలీసులు తమవంతు సహాయ సహకారాలను అందిస్తున్నారు. వీరికి జత కలిశారు హీరో విశాల్.

తమిళనాడులో కారైకుడి ప్రాంతంలో తన తాజా చిత్రం ‘పూజై’ చిత్రీకరణ కోసం విశాల్ వెళ్లారు. అక్కడ లోకల్ కేబుల్ చానల్లో వడ కర్రీ(కుల్ఫీ), ఉలవచారు బిర్యానీ చిత్రాలను ప్రసారం చేయడం చూసిన విశాల్ షాక్ కి గురయ్యారు. వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. విశాల్ ప్రయత్నాన్ని పలువురు ప్రముఖులు ప్రశంసించారు.

తాజా వార్తలు