రంపచోడవరంలో బాలయ్య సందడి

రంపచోడవరంలో బాలయ్య సందడి

Published on Jul 13, 2014 7:28 PM IST

Balayya-Rampachodavaram
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 98వ సినిమా ప్రస్తుతం సెట్స్ పైన ఉంది. సత్యదేవ డైరెక్టర్ గా పరిచయమవుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మాకు అందిన సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రంపచోడవరంలో జరుగుతుంది. ఈ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్లో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నాడు.

ఇటీవలే హైదరాబాద్ లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ రంపచోడవరంకి షిఫ్ట్ అయ్యింది. ప్రస్తుతానికి ‘గాడ్సే’ అనే వర్కింగ్ టైటిల్ అనుకుంటున్న ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఎంఎల్సి బ్యానర్ పై రుద్రపాటి రమణారావు నిమిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో బాలయ్య సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. లెజెండ్ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న బాలయ్య ప్రస్తుతం ఎమ్మెల్యేగా కూడా బిజీగా ఉన్నాడు.

తాజా వార్తలు