బుల్లి తెరపై సందడి చేయనున్న అమల.!

బుల్లి తెరపై సందడి చేయనున్న అమల.!

Published on Jul 14, 2014 1:24 PM IST

Amala
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా సందడి చేసిన అమల, అక్కినేని నాగార్జునని పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ తెరపై కనిపించలేదు. ఇటీవలే ఒకటి రెండు సినిమాలలో అతిధి పాత్రలో అలా తలుక్కున మెరిసింది. తాజా సమాచారం ప్రకారం అక్కినేని అమల త్వరలో బుల్లి తెరపై సందడి చేయనుంది. అది కూడా తెలుగులో కాకుండా తమిళంలో కావడం విశేషం.

త్వరలో తమిళంలో ప్రారంభం కానున్న ‘ఉయిర్మెయ్’ తమిళ సీరియల్లో కనిపించనుంది. ఈ సీరియల్లో అమల ఒక డాక్టర్ పాత్రలో కనిపించనుంది. ఈ సీరీస్ కూడా ఒక హాస్పిటల్లో పనిచేసే కొంత మంది డాక్టర్స్ టీం చుట్టూ, వారి పర్సనల్ జీవితాల చుట్టూ తిరుగుతుంది. ఈ సీరియల్ ఆగష్టు మిడిల్ నుంచి టీవీ లో టెలికాస్ట్ అవుతుందని అమల చెబుతోంది. ఇటీవలే నాగార్జున కూడా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’తో బుల్లితెరపై కనిపించి కనువిందు చేస్తున్నాడు.

తాజా వార్తలు