
‘బాహుబలి’ చిత్రం షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, మిల్కీ బ్యూటీ తమన్నాలపై ఒక రొమాంటిక్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు దర్శకుడు రాజమౌళి. యం.యం.కీరవాణి స్వరపరిచిన బాణీను తెరపై మరింత అందంగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పాటకు శంకర్ మాస్టర్ నృత్యరీతులు(కోరియోగ్రఫీ) సమకూరుస్తున్నారు.
కెరీర్ ఆరంభం నుండి గ్లామరస్ క్యారెక్టర్లు చేసిన తమన్నా తొలిసారి చారిత్రాత్మక చిత్రంలో నటించడం ఇదే మొదటిసారి. ‘బాహుబలి’ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. అనుష్క మరొక హీరోయిన్. రానా, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆర్కా మీడియా పతాకంపై శోబు యార్లగడ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్న ఈ చిత్రం తొలిభాగం వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.

