సినీ పరిశ్రమల్లో ఆ మధ్య సంచలనంగా మారిన ‘మీటూ’ ఉద్యమం ఇంకా రసవత్తరంగానే సాగుతుంది. తాజాగా సినీ పరిశ్రమలో కమిట్‌మెంట్‌ల పేరుతో ఎదురయ్యే సమస్యలు బహిరంగ రహస్యమే అని నటి వితిక షేరు రీసెంట్ గా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను 16 ఏళ్ల వయసులో ఎదుర్కొన్న ఒక చేదు అనుభవాన్ని ఇప్పటికీ మర్చిపోలేను. దాదాపు 14 ఏళ్ల క్రితం, నాకు 16 ఏళ్లు ఉన్నప్పుడు, హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో జరిగిన ఒక ఆడిషన్‌కు మా అమ్మతో కలిసి వెళ్లాను’ అని తెలిపారు.
వితిక ఇంకా మాట్లాడుతూ.. ‘ఆడిషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయి, పాత్రకు నన్ను ఎంపిక చేశారు. కానీ ఆ తర్వాత, “కమిట్‌మెంట్” గురించి అడిగారు. ఆ సమయంలో నన్ను బయటకు పంపి.. మా అమ్మతో కమిట్‌మెంట్ గురించి మాట్లాడారు. కమిట్‌మెంట్ గురించి అడిగిన వ్యక్తితో, తాము అలాంటి వాటికి ఆసక్తి చూపబోమని స్పష్టం చేశాము. ఆ తర్వాత కూడా నేను చాలా సినిమాలు వదులుకున్నాను’ అని ఆమె తెలిపారు.


