
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించబోయే ‘రోబో’ సీక్వెల్ లో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ విలన్’గా నటిస్తున్నాడా? నటించే అవకశాలు ఉన్నాయని ‘రోబో-2’ మూవీ యూనిట్ సభ్యులు చెప్తున్నారు. ప్రస్తుతం అమీర్ ఖాన్ తో దర్శకనిర్మాతలు చర్చలు జరుపుతున్నారు. ధూమ్-3లో అమీర్ విలన్ గా నటించిన సంగతి తెలిసిందే.
శంకర్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘ఐ’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ చిత్రం విడుదల తర్వాత ‘రోబో-2’ ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభిస్తారు. 2015లో షూటింగ్ మొదలవుతుంది.

