
మలయాళం లో రిలీజ్ అయిన ‘దృశ్యం’ చిత్రం కథలో యూనివర్సల్ యాక్సెప్టెన్స్ వుంది. మలయాళం లో బ్రహ్మాండమైన విజయం సాధించిన ఈ చిత్రాన్ని కన్నడ లో రీమేక్ చేయగా అక్కడ కూడా ఘన విజయం సాధించింది. ఇటివలే విడుదలైన తెలుగు వెర్షన్ కి కూడా అధ్బుతమైన స్పందన లభిస్తుంది.
ఒరిజినల్ వెర్షన్ రీమేక్ రైట్స్ తమిళ తో పాటు ఎన్నో బాషల్లో అమ్ముడుపోయాయి. కమల్ హసన్ హీరో గా నటిస్తున్న తమిళ చిత్రం షూటింగ్ ఈరోజు ప్రారంభం అయ్యింది.
మలయాళం లో ‘దృశ్యం’ చిత్రానికి దర్శకత్వం వహించిన జీతూ జోసెఫ్ తమిళ్ లో మాత్రమే ఈ చిత్రానికి తిరిగి దర్శకత్వం వహించనున్నారు. మీనా పాత్ర ని గౌతమి పోషించనుందని సమాచారం. ఆశక్తికరమైన విషయం ఏంటంటే ఈ చిత్రంతో కలిపి మూడు చిత్రాలు వెనువెంటనే విడుదల కానున్నాయి.
‘విశ్వరూపం 2’ చిత్రం ఇప్పటికే పూర్తి కాగా ‘ఉత్తమ విలన్’ షూటింగ్ కూడా పూర్తి కావొస్తుంది. ‘దృశ్యం’ దర్శకుడు ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా ఒకటి లేదా రెండు షెడ్యూల్ లలో పూర్తి చేసి త్వరలో విడుదల చేస్తామని తెలిపారు.

