ఖరారైన మహేష్ బాబు – కొరటాల సినిమాకి ముహూర్తం

ఖరారైన మహేష్ బాబు – కొరటాల సినిమాకి ముహూర్తం

Published on Jul 20, 2014 5:20 PM IST

Koratala-shiva-mahesh-babu
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘ఆగడు’ సినిమా షూటింగ్ ని ఫినిష్ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ ఆగష్టు కల్లా పూర్తవుతుంది. ఈ సినిమా పూర్తి కాగానే మహేష్ బాబు తన తదుపరి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి ముహూర్తం ఫిక్స్ చేసాడు. మహేష్ బాబు ‘ఆగడు’ సినిమా తర్వాత కొరటాల దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ముందుగా ఈ సినిమా జూలైలో ప్రారంభం కావాలి. కానీ కాస్త ఆలస్యంగా ఆగష్టులో మొదలు కానుంది.

మహేష్ బాబు – కొరటాల శివ సినిమా ఆగష్టు 11న లాంచనంగా ప్రారంభం కానుంది. రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ లో మొదలు పెట్టి సినిమాని 2015 సమ్మర్ కానుకగా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. మైత్రి మూవీస్ నిర్మించనున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించనుంది.

తాజా వార్తలు