అడివి శేష్ కెరీర్ లోనే అతిపెద్ద ఓపెనింగ్స్ !

అడివి శేష్ కెరీర్ లోనే అతిపెద్ద ఓపెనింగ్స్ !

Published on Apr 12, 2026 1:00 PM IST

Dacoit

అడివి శేష్ హీరోగా నటించిన సినిమా ‘డెకాయిట్. ఐతే, అడవి శేష్ కెరీర్‌లోనే అతిపెద్ద ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా ఈ చిత్రం నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజుతో పాటు రెండో రోజు కూడా మంచి వసూళ్లు సాధించింది ఈ సినిమా. మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో ఈ సినిమా మొత్తం గ్రాస్ 28 కోట్లు ~ (మొదటి రోజు-15 కోట్లు కాగా + రెండవ రోజు -13 కోట్లు). ఇక హిందీ వెర్షన్ రెండవ రోజు: 1.75 కోట్ల గ్రాస్, మొదటి రోజు: 1.3 కోట్లు. అంటే.. మొదటి రోజు కంటే ఎక్కువ రాబట్టడం నిజంగా విశేషమే.

అటు విదేశాలలో $1 మిలియన్‌కు పైగా వసూళ్లు సాధించింది. అమెరికా నుండి కూడా బలమైన కలెక్షన్స్ వస్తున్నాయి. మొత్తమ్మీద ‘డెకాయిట్’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ ఫీల్ గుడ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. అడవి శేష్, మృణాల్ ఠాకూర్ నటన సినిమాకి బాగా ప్లస్ అయింది. అలాగే, టేకింగ్ అండ్ మేకింగ్ కూడా సినిమా స్థాయిని పెంచాయి. ఈ సినిమాకి నిర్మాతలు సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్.

తాజా వార్తలు