ప్రెస్ నోట్ : ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం నిర్వహించిన ఆరోగ్య అవగాహన సదస్సు

ప్రెస్ నోట్ : ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం నిర్వహించిన ఆరోగ్య అవగాహన సదస్సు

Published on Jul 24, 2014 11:00 AM IST

texas1
జూలై 19, 2014 డాలస్/ఫోర్టువర్త్, టెక్సస్:

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టా౦టెక్స్) కమ్యూనిటీ సర్వీసెస్ విభాగం ఈ నెల జూలై19న’మధుమేహ వ్యాధి – అవగాహన’ సదస్సు కార్యక్రమము కమ్యూనిటీ సర్వీసెస్ సమన్వయకర్త శ్రీమతి జ్యోతి వనం అధ్యక్షతన నిర్వహించబడినది. డా. సుమన గంగి,డా. శ్రీనివాస్ బొంత గార్లు పాల్గొని – నేడు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకారిగా పరిగణింపబడుతున్న, అతి వేగంగా విస్తరిస్తున్న మధుమేహ వ్యాధిపై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. డా. సుమన గంగి తమ ప్రసంగంలో వ్యాధి లక్షణాలనూ, తీసుకోవలసిన జాగ్రత్తలనూ, నివారణా చర్యలను గురించి చక్కగా వివరించారు. మధుమేహ వ్యాధి ఇంతత్వరగా వ్యాప్తి చెందడానికి మనంతీసుకొనేఆహారం, మన జీవనవిధానమే ముఖ్యమైనకారణం అన్నారు. 30 సంవత్సరాలు పైబడిన ప్రతిఒక్కరూ ఈవ్యాధి బారినపడే ఆవకాశంవుందికనుక ప్రతిఒక్కరూ క్రమపద్ధతిలో పరీక్షలుచేసుకొని,తగినజాగ్రతలను పాటించి, చక్కని ఆహారపుఅలవాట్లు, తగినంత శారీరకవ్యాయామము, క్రమంతప్పకుండా ఆరోగ్యసమీక్ష చేసుకోవాలి అనిసూచించారు. ఈవ్యాధి వంశపారంపర్యంగా వచ్చేఅవకాసం ఎక్కువకనుక, తమపూర్వీకుల్లో మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నట్టయితే, మరింత జాగ్రత అవసరం అని తెలిపారు.. ప్రస్తుత ప్రపంచజనాభాలో గుండెపోటుతో మరణించేవారిలో దాదాపు 90% మధుమేహ వ్యాధిగ్రస్తులే అని డా. సుమన గంగి తెలిపారు. ఈ జబ్బు నిశ్శబ్దహంతకి ( సైలెంట్ కిల్లర్) అని మనం మరచిపోకూడదు.

డా. శ్రీనివాస్ బొంతగారు థైరాయిడ్ గ్రంధి సరిగ్గా పనిచేయకపోవడం వలన మానవశరీరానికి కలిగే అనర్థాలను సభ్యులకు లకు సోదాహరణంగా వివరించారు. మానవశరీరంలో పిట్యూటరీ గ్రంధి దిగువభాగాన,మెడకు రెండువైపులా విస్తరించి వున్న ఈ థైరాయిడ్ గ్రంధి శారీరక సమతుల్యాన్ని కాపాడడంలోముఖ్యమైన భూమిక నిర్వహిస్తుంది. ఇది సరిగా పనిచేయకపోవడం జరిగితే మనం అనేకమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అని తెలియ చేసారు . మైగ్రేన్ (పార్శ్వపు నొప్పి), శరీరపు బరువుపెరగడం, జుట్టువూడడం, కొన్నిసందర్భాలలో బరువుతగ్గడంకూడా సంభవించే ప్రమాదంవుంది అనిచెప్పారు. థైరాయిడ్ సమస్య నేడు సర్వసాధారణమైన రుగ్మతగా పరిగణింప బడుతూవుంది. సరైన సమయంలో దీనిని గుర్తించి ,సక్రమమైన పద్ధతిలో చికిత్స పొందగలిగితే ఇది చాలాసులువుగా నియంత్రించగలిగే అవకాసం వుంది.. ఇటువంటి ఉపయోగకరమైన కార్యక్రమాలను ముందు ముందు మరెన్నో అందించాలని ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం సంస్థకు సభ్యులు మనవి చేసారు.

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం ఉత్తరాధ్యక్షులు డా.నరసింహారెడ్డి ఊరిమిండి, సంస్థ ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, కార్యదర్శి కృష్ణారెడ్డి ఉప్పలపాటి,కార్యవర్గసభ్యులు చినసత్యం వీర్నపు, మహేష్ ఆదిత్య ఆదిభట్ల,బాల్కి చామ్కుర, రఘు చిట్టిమల్ల, వేణు మాధవ్ పావులూరి , కృష్ణవేణి శీలం, శారద సింగిరెడ్డి లతో కలిసి ప్రశంసా పత్రాలను డాక్టర్ సుమన గంగి,డాక్టర్ శ్రీనివాస్ బొంత గారిలకు అందజేసారు. ఈ సభలో కమ్యూనిటీ సర్వీసెస్ సభ్యులు పూర్ణిమ పొత్తూరి, రాజేంద్ర మదాల, మురళి కొండేపాటి, నగేష్ దిండుకుర్తి పాల్గొన్నారు.

కార్యక్రమాన్ని ముగిస్తూ కమ్యూనిటీ సర్వీసెస్సభ్యులతో కలిసి సమన్వయకర్త శ్రీమతి జ్యోతి వనం తమ ధన్యవాదాలను డా. సుమన గంగి,డాక్టర్ శ్రీనివాస్ బొంత గార్లకు, వేదిక మరియు స్వల్పాహార,తేనీటి విందులను ఏర్పరచిన మయూరి రెస్టారెంట్ యాజమాన్యానికి,ప్రసార మధ్యమాలైన దేశిప్లాజా,6టివి వారికి, సభ్యులకు కృతజ్ఞతాభివందనములను తెలియచేస్తూ సభనుముగించారు.

texas2

texas3

texas4

texas5

texas6

texas7

తాజా వార్తలు