డెకాయిట్ ఎఫెక్ట్ : లక్కీ ఛాన్స్ వదులుకున్న శృతి హాసన్..?

డెకాయిట్ ఎఫెక్ట్ : లక్కీ ఛాన్స్ వదులుకున్న శృతి హాసన్..?

Published on Apr 12, 2026 1:00 AM IST

Shruti-Haasan-Dacoit

టాలీవుడ్ లో లేటెస్ట్ గా విడుదలైన ‘డెకాయిట్’ చిత్రంలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. సీతారామం, హాయ్ నాన్న సినిమాల తర్వాత మృణాల్ మరోసారి తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా ఈ చిత్రంలో ఆమె పోషించిన పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా ఉండటంతో, అది సినిమాకే హైలైట్‌గా నిలిచింది.

​అయితే, ఈ పాత్రను మొదట శృతి హాసన్ చేయాల్సింది. ఆమె కొన్ని సీన్ల షూటింగ్‌లో కూడా పాల్గొని, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. ఇప్పుడు సినిమా సక్సెస్ అవ్వడం, మృణాల్‌కు మంచి పేరు రావడంతో.. శృతి ఒక మంచి అవకాశాన్ని వదులుకుందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

​ప్రస్తుతం శృతి హాసన్ బలమైన పాత్రల కోసం చూస్తోంది. ఇలాంటి సమయంలో ‘డెకాయిట్’ వంటి సినిమా ఆమెకు కెరీర్ పరంగా పెద్ద ప్లస్ అయ్యేది. అమెరికాలో కూడా మంచి వసూళ్లు రాబడుతున్న ఈ చిత్రం, శృతికి ఒక చేజారిన గొప్ప అవకాశంగా మిగిలిపోయింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు