ఒకరిపై మరొకరు పొగడ్తల వర్షం – తమన్నా, సమంత

ఒకరిపై మరొకరు పొగడ్తల వర్షం – తమన్నా, సమంత

Published on Jul 25, 2014 4:00 AM IST

samatha_tamanna

టాలీవుడ్ టాప్ హీరోయిన్లు సమంత, తమన్నా ఒకరిపై మరొకరు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఈ రోజు విడుదలైన ‘అల్లుడు శీను’ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. మిల్కీ బ్యూటీ తమన్నా ‘నా ఇంటి పేరు సిల్కు… ఒంటి రంగు మిల్క్ ..’ అంటూ ఐటెం సాంగ్ లో సందడి చేసింది.

‘అల్లుడు శీను’ విడుదల సందర్భంగా టీం అందరికి విషెస్ తెలుపుతూ.. తమన్నా ట్వీట్ చేసింది. బదులుగా నువ్వు సాంగ్ లో చాలా హాట్ గా ఉన్నావు అంటూ సమంత కాంప్లిమెంట్ ఇచ్చింది. తర్వాత మిల్కీ బ్యూటీ నువ్వు ఎప్పటిలానే సినిమాలో రాకింగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చావు అంటూ సమంతపై తన స్నేహాన్ని చాటుకుంది. ఈ మాటలకు ట్విట్టర్ వేదిక అయ్యింది.

గతంలో హీరోయిన్ల మధ్య విబేధాలు ఉన్నాయంటూ పలు పుకార్లు వచ్చేవి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత అటువంటి అసత్య వార్తలకు చెక్ పడింది.

samantha_tamanna

సంబంధిత సమాచారం

తాజా వార్తలు