పారగాన్ బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ బాబు

పారగాన్ బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ బాబు

Published on Jul 25, 2014 5:30 AM IST

Mahesh_babu1

ఆరడుగుల హాన్డ్సం హీరో సూపర్ స్టార్ మహేష్ బాబుకి టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. మహేష్ బాబు టాలీవుడ్ లో సినిమాలతో ఎంత బిజీగా ఉన్నాడో, చాలా ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా అంతే బిజీగా ఉన్నాడు. ఇప్పటికే థమ్స్ అప్, వివేల్, ప్రోవోగ్, ఐడియా, నవరత్న ఆయిల్స్, జాస్ అలుక్కాస్, టివిఎస్, రాయల్ స్టాగ్ మొదలైన వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు.

ఇవన్నీ కాకుండా మహేష్ బాబు తాజాగా ఫేమస్ చెప్పల్స్ బ్రాండ్ అయిన పారగాన్ కి కూడా బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసాడు. ఇప్పటికే స్టార్ హీరోయిన్ సమంత పారగాన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తోంది. తాజాగా మహేష్ బాబు కూడా సైన్ చేయడంతో వీరిద్దరి కాంబినేషన్ లో యాడ్స్ వచ్చే అవకాశం కూడా ఉంది.

మహేష్ బాబు ప్రస్తుతం ‘ఆగడు’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్లో విడుదల కానుంది. ఇది విడుదల కాగానే కొరటాల శివ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు