త్వరలో రానా దగ్గుబాటి హిందీ సినిమా..

త్వరలో రానా దగ్గుబాటి హిందీ సినిమా..

Published on Jul 25, 2014 9:30 AM IST

rana
ఆరడుగుల హైట్, ఆజానుబాహుడి లాంటి రానా పర్సనాలిటీ బాలీవుడ్ దర్శకనిర్మాతలను అమితంగా ఆకర్షించింది. హిందీలో ‘ధమ్ మరో ధమ్’, ‘డిపార్టుమెంట్’ చిత్రాలలో రానా నటించాడు. ఆ సినిమాలు పరాజయం పాలైనా బి-టౌన్ మీడియా ఎప్పుడూ రానాను వార్తలలో ఉండేలా చూసుకుంది. హీరోయిన్లతో ఎఫైర్ ముడి పెడుతూ మన టాలీవుడ్ అందగాడికి మాక్సిమం క్రేజ్ కల్పించింది.

తాజాగా రానాకు మరో హిందీ ఆఫర్ వచ్చింది. అక్షయ్ కుమార్, రానా హీరోలుగా మల్టీస్టారర్ సినిమా తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని టాక్. మిగతా వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

ప్రస్తుతం రానా ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ చిత్రాలలో నటిస్తున్నాడు. ఇవి రెండు ద్విభాషా(తెలుగు, తమిళం) చిత్రాలే. చారిత్రాత్మక కథలతో వీటిని రూపొందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు