సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా క్రిష్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కించడానికి సన్నాహాలు చేశారు నిర్మాత అశ్వనిదత్. హిందీ హీరోయిన్ సోనాక్షి సిన్హా మహేష్ సరసన నటించడానికి తన అంగీకారం కూడా తెలిపింది. కారణాలు ఏవైనా ఆ సినిమా పట్టాలేక్కలేదు. తాజాగా నిర్మాత అశ్వనిదత్ మహేష్ బాబు హీరోగా నవంబర్లో సినిమా ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు..? అనే చర్చ జరుగుతుంది.
మహేష్ బాబుతో ‘పోకిరి’, ‘బిజినెస్ మాన్’ వంటి సూపర్ సక్సెస్ సినిమాలను అందించిన దర్శకుడు పూరి జగన్నాధ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ప్రస్తుతం కదా చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం మహేష్ ‘ఆగడు’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో రూపొందే సినిమా షూటింగ్లో పాల్గొంటారు.


