
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఇండస్ట్రీ హిట్ మూవీ ‘అత్తారింటికి దారేది’ను కన్నడలో సుదీప్ రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో హరిప్రియ ఒక హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగులో ప్రణిత పోషించిన పాత్రలో కనిపించనుంది. సమంత పాత్రలో కన్నడ హీరోయిన్ రచిత రామ్ నటిస్తుంది.
‘ఈగ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుదీప్ బాగా చేరువయ్యారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘బాహుబలి’లో అతిధి పాత్రలో నటించారు. ఇటివలే మిర్చి సినిమాను కన్నడలో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. వెంటనే మరో తెలుగు రీమేక్ కు రెడీ అయ్యారు.

