
మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న ‘పవర్’ సినిమా మరో తాజా షెడ్యూల్ కోసం రంగం సిద్దం చేసుకుంటోంది. ఇటీవలే ఈ చిత్ర టీం బ్యాంకాక్ షెడ్యూల్ ని పూర్తి చేసుకొని ఇండియాకి తిరిగి వచ్చింది. అక్కడ కొన్ని భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ని షూట్ చేసారు. త్వరలోనే ఈ మూవీ న్యూ షెడ్యూల్ మొదలు కానుంది. రవితేజ సరసన ఈ సినిమాలో హన్సిక హీరోయిన్ గా నటిస్తోంది.
ప్రస్తుతం హన్సిక హాలిడేస్ ట్రిప్ ని యూరప్ లో ఎంజాయ్ చేస్తోంది. ఈ ట్రిప్ పూర్తి చేసుకొని హన్సిక తిరిగిరాగానే పవర్ కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. కెఎస్ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సెప్టెంబర్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రెజీన సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. ‘బలుపు’ తర్వాత బాగా గ్యాప్ తీసుకొని రవితేజ చేస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి.

