హారర్ థ్రిల్లర్ ‘శబ్దం’ తెలుగు వెర్షన్.. ఫైనల్ గా ఈ ఓటీటీలో..

హారర్ థ్రిల్లర్ ‘శబ్దం’ తెలుగు వెర్షన్.. ఫైనల్ గా ఈ ఓటీటీలో..

Published on Apr 10, 2026 7:02 PM IST

Sabdham

టాలెంటెడ్ నటుడు ఆది పినిశెట్టి హీరోగా చేసిన కొన్ని సినిమాల్లో కూడా మంచి కంటెంట్ తో కూడిన సినిమాలు కూడా ఉన్నాయి. అలా తను చేసిన వాటిలో వైశాలి అనే హారర్ థ్రిల్లర్ కూడా ఒకటి. మరి ఆ కాంబినేషన్లో చేసిన తదుపరి సినిమానే ‘శబ్దం’. రిలీజ్ కి ముందు మంచి బజ్ ని సొంతం ఈ సినిమా ఓటీటీ లోకి రావడానికి మాత్రం ఏడాదిన్నర సమయం తీసుకుంది.

అయితే ఈ సినిమా ఒరిజినల్ తమిళ్ లో వచ్చింది కానీ తెలుగులో రాకపోవడం తెలుగు ఆడియెన్స్ ని నిరాశకు గురి చేసింది. కానీ ఫైనల్ గా ఈ సినిమా తెలుగు వెర్షన్ లో కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఆల్రెడీ తమిళ్, హిందీ వెర్షన్ లని స్ట్రీమింగ్ కి తెచ్చిన జీ5 లోనే ఈ సినిమా ఇప్పుడు స్ట్రీమింగ్ కి వచ్చింది. సో ఈ సినిమాని అప్పుడు మిస్ అయ్యి చూడాలి అనుకునేవారు ఇప్పుడు చూడొచ్చు. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందించగా అరివళగన్ దర్శకత్వం వహించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

తాజా వార్తలు