‘అల్లుడు శీను’ టీంని మెచ్చుకున్న ఎన్.టి.ఆర్

‘అల్లుడు శీను’ టీంని మెచ్చుకున్న ఎన్.టి.ఆర్

Published on Aug 3, 2014 11:30 AM IST

ntr

కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ మొదటిసారిగా కొత్త హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ని తెలుగు తెరకు హీరోగా పరిచయం చేస్తూ చేసిన సినిమా ‘అల్లు శీను’. జూలై 25న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని బెల్లంకొండ గణేష్ బాబు నిర్మించాడు. దేవీశ్రీ ప్రసాద్ అందించిన పాటలు కూడా బాగా హిట్ అవ్వడంతో ఈ రోజు ‘అల్లుడు శీను’ ప్లాటినం డిస్క్ వేడుకని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు.

ఎన్.టి.ఆర్ మాట్లాడుతూ ‘నాకు టైం బాగుంది, దశ బాగుంది అనే వాటి మీద నమ్మకం లేదు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే దాన్ని నమ్ముతాను. వినయ్ అన్నయ్య సినిమాకోసం బాగా కష్టపడతాడు, ఎంతో మదన పడతాడు. అందుకే ఈ సినిమా ఇంతపెద్ద విజయాన్ని అందుకుంది. వినాయక గారికి తోడుగా ఈ సినిమా విజయంలో భాగస్వాములైన టీం మెంబర్స్ అందరికీ నా శుభాకాంక్షలు. శ్రీనివాస్ మొదటి సినిమా అయినా కానీ కెమెరా ముందు ఏ మాత్రం జంకు లేకుండా నటించాడు. అలాగే తన తండ్రి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా, బెల్లంకొండ సురేష్ కి పుత్రోత్సాహాన్ని అందించాడు. శ్రీనివాస్ కి నేనిచ్చే సలహా ఒక్కటే ఇండస్ట్రీలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని, అలా ఒదిగి తన పని తానూ చేసుకుంటూ వెళ్ళాలని ఆశిస్తున్నానని’ అన్నాడు.

తాజా వార్తలు