ఎన్.టి.ఆర్ సరసన చాన్స్ కొట్టేసిన మధురిమ

ఎన్.టి.ఆర్ సరసన చాన్స్ కొట్టేసిన మధురిమ

Published on Aug 3, 2014 2:23 PM IST

ntr-madhurima

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఆగష్టు 1 న లాంఛనంగా ప్రారంభమయ్యాయి. అలాగే ఎన్.టి.ఆర్ లేకుండా మిగతా నటీనటులపై మొదటి షెడ్యూల్ ని ఆగష్టు 2 నుంచి ప్రారంభించారు. బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించనుంది.

ఈ సినిమాలో మరో హీరోయిన్ కి కూడా అవకాశం ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ కోసం మధురిమని ఎంపిక చేసారు. ఈ విషయం గురించి మధురిమ మాట్లాడుతూ ‘పూరి జగన్నాధ్ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించనున్నాను. నా పాత్ర సినిమాకి టర్నింగ్ పాయింట్ అవుతుంది. ప్రస్తుతానికి ఇంతకన్నా ఏమీ చెప్పలేనని’ మధురిమ తెలిపింది.

వక్కంతం వంశీ కథని అందించిన ఈ సినిమా 2015 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఇది కాకుండా ఎన్.టి.ఆర్ నటించిన ‘రభస’ సినిమా ఆగష్టు 15న విడుదల కావడానికి సిద్దమవుతోంది.

తాజా వార్తలు