
ఒకప్పటి హస్య చిత్రాల కధానాయకుడు, సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్ట్ 7 ఉదయం 9 గంటలకు రామానాయుడు స్టూడియోస్ లో పూజా కార్యక్రమాలతో లాంచనంగా ప్రారంభం కానుంది. తొలి షాట్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు క్లాప్ కొట్టనున్నారు. తొలి సన్నివేశానికి విజయనిర్మల గౌరవ దర్శకత్వం వహిస్తారు. సూపర్ స్టార్ కృష్ణ కెమెరా స్విచ్ ఆన్ చేయనున్నారు.
ఈ సినిమా ద్వారా కృష్ణవంశి అసిస్టెంట్ రామ్ ప్రసాద్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై చంటి అడ్డాల నిర్మిస్తున్నారు. హీరోయిన్, ప్రధాన తారాగణం తదితరుల వివరాలు మూవీ ఓపెనింగ్ రోజున వెల్లడయ్యే అవకాశం ఉంది.

