
తెలుగమ్మాయి అంజలి ప్రధాన పాత్రలో, ప్రముఖ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి హీరోగా తెరకేక్కినా హర్రర్ కామెడీ మూవీ ‘గీతాంజలి’. ప్రముఖ రచయిత కోనా వెంకట్ సమర్పణలో ఎంవివి సినిమా బ్యానర్ పై
ఎంవివి సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ద్వారా రాజ కిరణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కోన వెంకట్ ఈ సినిమాకి సమర్పకుడిగానే కాకుండా స్క్రీన్ ప్లే – డైలాగ్స్ ని కూడా అందించాడు.
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీం సరైన రిలీజ్ డేట్ కోసం గత కొద్ది రోజులుగా ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని ఆగష్టు 8న రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని శ్రీనివాస్ రెడ్డి కూడా ఖరారు చేసాడు. ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో బ్రహ్మానందం, రావు రమేష్, సత్యం రాజేష్, శకలక శంకర్, మధునందన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

