
‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమైన మేర్లపాక గాంధీ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని అందరి దృష్టిని తనవైపు ఆకర్షించుకున్నాడు. మేర్లపాక గాంధీ త్వరలోనే తన బ్యాచిలర్ జీవితానికి శుభం కార్డు వేసి, పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడు కానున్నాడు. మేర్లపాక్ గాంధీ వివాహం ఆగష్టు 10వ తేదీన చి.ల.సౌ సుష్మ అనే కుమార్తెతో జరగనుంది. మేర్లపాక గాంధీ తన వివాహ మహోత్సవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానమైన తిరుపతిలో జరగనుంది.
మేర్లపాక్ అగాన్దీ తన రెండవ సినిమాని అక్కినేని సుశాంత్ హీరోగా చేయనున్నాడు. ఈ సినిమాని శ్రీ నాగ్ ఫిల్మ్ కార్పొరేషన్ పతాకంపై చింతలపూడి శ్రీనివాసరావు, నాగ సుశీల కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.

