యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘రభస’. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకి సంబందించిన డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. అలాగే తమన్ ఇప్పటికే ఫస్ట్ హాఫ్ కి రీ రికార్డింగ్ పూర్తి చేసాడు. ఇక సెకండాఫ్ కి సంబందించిన రీ రికార్డింగ్ పార్ట్ మాత్రమే మిగిలి ఉంది.
నిన్ననే ఈ సినిమాలో హాకీ గ్రౌండ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే కొన్ని పాచ్ వర్క్ సీన్స్ ని కూడా షూట్ చేసారు. ఎన్.టి.ఆర్ సరసన మూడవ సారి సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ప్రణిత సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించాడు. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది. కామెడీ, సెంటిమెంట్ అన్నీ కలగలిపిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి బెల్లంకొండ గణేష్ బాబు నిర్మాత. ఆగష్టు 15న ఈ సినిమా భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.


