మురుగదాస్ డైరెక్షన్ లో సూర్య డైరెక్ట్ తెలుగు సినిమా.!

మురుగదాస్ డైరెక్షన్ లో సూర్య డైరెక్ట్ తెలుగు సినిమా.!

Published on Aug 5, 2014 2:34 PM IST

surya-ar-murugadoss
తమిళ స్టార్ హీరో సూర్యకి తమిళంలోలానే తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కొద్ది రోజుల క్రితమే సూర్య ఓ డైరెక్ట్ తెలుగు సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిపాము. మాకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం గతంలో సూర్యతో ‘గజినీ’, ‘సెవెంత్ సెన్స్’ లాంటి సినిమాలు తీసిన స్టార్ డైరెక్టర్ మురుగదాస్ సూర్య డైరెక్ట్ తెలుగు సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. గతంలో మురుగదాస్ మెగాస్టార్ చిరంజీవితో ‘స్టాలిన్’ సినిమాని కూడా తీసాడు.

అలాగే ఈ సినిమాని ఠాగూర్ మధు – నల్లమలపు బుజ్జి కలిసి నిర్మించానున్నారని సమాచారం. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సూర్య ప్రస్తుతం త్వరలో రిలీజ్ కానున్న ‘అంజాన్’ (తెలుగులో సికందర్) సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఇది కాకుండా తమిళంలో వెంకట్ ప్రభు డైరెక్షన్ లో ‘మాస్’ సినిమాని స్టార్ట్ చేసాడు. ఈ సినిమా తర్వాత డైరెక్ట్ తెలుగు సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం మురుగదాస్ కూడా విజయ్ తో చేస్తున్న ‘కత్తి’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

తాజా వార్తలు