
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘గోవిందుడు అందరివాడేలే’. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని నిన్న నానక్రాం గూడా లోని రామానాయుడు స్టూడియోస్ లో లాంచ్ చేసారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్, శ్రీ కాంత్, కాజల్ అగర్వాల్, కృష్ణవంశీ, కమిలినీ ముఖర్జీ, బండ్ల గణేష్ తదితరులు పాల్గొన్నారు.
రామ్ చరణ్ మాట్లాడుతూ ”మగధీర’ తర్వాత ఎలాంటి సినిమా చెయ్యాలి అని ఆలోచిస్తుంటే కృష్ణవంశీ గారు గుర్తొచ్చారు. ఆయన్ని ఎప్పడు కలిసినా మీతో చెయ్యాలి అని అంటుంటే కృష్ణవంశీ గారేమో నన్ను ఓ చిన్నపిల్లాడిలా చూసి నవ్వి వెళ్ళిపోయేవారు. నాలుగేళ్ళకు ఆయనకు నాతో సినిమా చేయాలి అనిపించింది. మన తెలుగు సినిమాకి దొరికిన ఆస్థి కృష్ణవంశీ. ఈ సినిమా చెయ్యకపోతే ఫ్యామిలీ ఆడియన్స్ కి దూరం అయ్యే వాడిని, అందుకే ఈ సినిమా చేసే చాన్స్ వదులుకోలేదని’ చరణ్ అన్నాడు.

