
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాలను రామానాయుడు సినీవిల్లెజ్ లో చిత్రీకరిస్తున్నారు. క్లైమాక్స్ షూటింగ్ పూర్తయిన తర్వాత ఆగస్ట్ 20న మూవీ యూనిట్ ఫారిన్ వెళ్లనున్నారు. ఒక యాక్షన్ సీక్వెన్స్ తో పాటు పాటలను ఫారిన్ లో షూట్ చేస్తారు. సెప్టెంబర్ మొదటివారం వరకు ఫారిన్ షెడ్యూల్ కొనసాగుతుంది.
ఇటివలే విడుదలైన ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. బండ్ల గణేష్ ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, కమలిని ముఖర్జీ ముఖ్య పాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ ‘గోవిందుడు..’ దసరా కానుకగా అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

