నందమూరి బాలకృష్ణ మరియు తారక రామారావుల మధ్య పరస్పర విరోధం వున్నట్టు ఫిలింనగర్ వర్గాలకు తెలిసిన విషయమే. దీనికి పలు
కారణాలు కూడా వున్నాయన్నది వాస్తవం, కానీ ఈ మధ్య వీరి మధ్య వున్న వైరం నిమ్మదిగా తగ్గుతుందని తెలుస్తుంది. అయితే ఆశ్చర్యకరంగా బాలయ్య ఆరోగ్య పరిస్థితిపై ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు.
“బాబాయ్ త్వరగా కోలుకుంటున్నారు… అభిమానులకు నా విజ్ఞప్తి.. సింహం త్వరలోనే కోలుకుంటుంది. త్వరలోనే గర్జిస్తుంది” అని ట్వీట్ చేశాడు.ఈ ట్వీట్ ద్వారా నందమూరి హీరోలకు సఖ్యత పెరిగిందని నందమూరి అభిమానులు ఆనందంలో వున్నారు. కాబట్టి ఈ వదంతులకు ఇక్కడితో ఫుల్ స్టాప్ పడాలని కోరుకుంటూ, బాలకృష్ణ గారు త్వరగా కోలుకోవాలని 123 తెలుగు తరుపున కోరుకుంటున్నాం.


