ఐటెం సాంగులతో ట్రెండ్ సెట్ చేస్తున్న శృతి హాసన్..!

ఐటెం సాంగులతో ట్రెండ్ సెట్ చేస్తున్న శృతి హాసన్..!

Published on Aug 9, 2014 9:00 AM IST

Sruthi-Hasan
ప్రస్తుతం స్టార్ హీరోలు, హీరోయిన్లు తమ సినిమాలలో కొత్త ట్రెండ్ గా మారింది. స్వతహాగా సింగర్ అయిన శృతి పలు సినిమాలలో పాటలు పాడింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘ఆగడు’ సినిమాలో శృతి హాసన్ ఐటెం సాంగ్ పాడింది. ఆ పాటలో డాన్స్ చేసింది కూడా తనే. తాజాగా శృతి హాసన్ మరో ఐటెం సాంగ్ పాడనుండి. అయితే ప్రస్తుతం పాడుతున్న పాటకు బాలీవుడ్ టాప్ హీరోయిన్ సోనాక్షి సిన్హా డాన్స్ చేయనుండడం విశేషం. వరుసగా ఐటెం సాంగులు పాడడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ శృతి కొత్త ట్రెండ్ సెట్ చేస్తుంది.

అర్జున్ కపూర్, సోనాక్షి సిన్హా జంటగా నటిస్తున్న హిందీ సినిమా ‘తేవార్‌’. తెలుగులో ఘనవిజయం సాదించిన ‘ఒక్కడు’ సినిమాకు హిందీ రీమేక్ ఈ ‘తేవార్‌’. వాయిస్ కొత్తగా ఉండాలని శృతి హాసన్ ను సంప్రదించినట్టు సంగీత దర్శక ద్వయం సాజిద్‌-వాజిద్‌లు తెలిపారు. ప్రస్తుతం శృతి హాసన్ చాలా బిజీ. వరుస సినిమా షూటింగ్లతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంది.

తాజా వార్తలు