
ఘట్టమనేని మహేష్ బాబు జన్మదినం నేడు. మన సూపర్ స్టార్ ఇదేరోజు 1975 న జన్మించారు. కృష్ణ, ఇందిర గారాల బిడ్డగా చిన్నప్పటినుండి
సినిమాలకు పరిచయమైన బాల నటుడిగా మహేష్ బాబు ఇండస్ట్రీ వర్గాలకు సుపరిచితుడు. మహేష్ చిన్నతనం చెన్నైలో సాగింది
చెన్నై లయోలా కాలేజి ద్వారా డిగ్రీ పట్టా అందుకున్న మహేష్ 1999లో రాఘవేంద్రరావు గారి చేతుల మీదిగా ‘రాజకుమారుడు’గా పరిచయమయ్యాడు.
దానికి ముందే గూడచారి 116, కొడుకు దిద్దిన కాపురం సినిమాలలో బాల నటుడిగా నటించాడు. తర్వాత యువరాజు, వంశీ వంటి చిత్రాలు చేస్తున్నా
కమర్షియల్ హిట్ మాత్రం ‘మురారి’ ద్వారా అందుకున్నాడు. ‘ఒక్కడు’ సినిమాతో స్టార్ డమ్ సంతరించుకున్న ఈ ప్రిన్స్ ఆ తర్వాత ఇక వెనుదిరిగి
చూడలేదు. పోకిరి సినిమాతో ఇండస్ట్రీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు మహేష్. కొత్తదనానికి ప్రాధాన్యత ఇస్తూ 25 సంవత్సరాల తరువాత
వెంకటేష్ తో కలిసి ‘సీతమ్మ వాకిట్లో…’ వంటి మల్టీ స్టారర్ లో నటించి చరిత్రలో నిలిచాడు
మహేష్ వరసుగా ఫిలిం ఫేర్, నంది అవార్డులను గెలుచుకోవడమే కాక ఈ ఏడాది మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ గా నిలిచాడు. మరి మన ఆగడుకి 123 తెలుగు
ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దామా?

