
అందమైన రూపం మాత్రమె కాదు, మంచి మనసు కూడా ఉంది హన్సికకు. టీనేజ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగిన హన్సిక, సమాజ సేవలో ముందుంది. తన ప్రతి పుట్టినరోజున ఒక పేద విద్యార్ధి లేదా అనాధను దత్తత తీసుకోవడం హన్సిక అలవాటు. అలా ఇప్పటివరకు హన్సిక 25 మంది పిల్లలను దత్తత తీసుకుంది. వారి చదువులకు అయ్యే ఖర్చులను మొత్తం భరిస్తుంది. ఆ పిల్లల బాగోగులను కూడా తానె చూసుకుంటుంది. ఈ రోజు, ఆగస్ట్ 9 హన్సిక బర్త్ డే. తన బర్త్ డే సందర్భంగా ఈ ఏడాది మరో ఐదుగురు చిన్నారులను దత్తత తీసుకోవాలని అనుకుంటుంది.
సాధారణంగా హీరోలతో పోల్చి చూస్తే హీరోయిన్ల కెరీర్ టైం చాలా తక్కువ. తమకు క్రేజ్, తమపై ప్రేక్షకులకు మోజు ఉన్నప్పుడే నాలుగు రూపాయలు సంపాదించుకుని తట్టా బుట్టా సర్దేసుకుందాం అనుకునేవాళ్లు ఎక్కువ. ఇలాంటి సమయంలో హన్సిక చేస్తున్న మంచి పని చూసి పలువురు ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. హన్సిక నటించిన తాజా తెలుగు సినిమా ‘పవర్’ ఆడియో ఆగస్ట్ 10న విడుదల అవుతుంది.
హన్సిక మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, ఇంకా చాలా మంచి చిన్నారుల జీవితాలలో సంతోషం నింపాలని కోరుకుంటూ 123తెలుగు.కామ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

