ఈ రోజు రాఖీ పండుగ.. అంటే అన్నా చెల్లెళ్ళకు, అక్కా తమ్ముళ్ళకు ఎంతో ప్రీతీ ప్రదమైన రోజు.. మన ఇండస్ట్రీలో కూడా చాలామంది అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు ఉన్నారు.. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు – మంజుల కుడా ఉన్నారు.. రాఖీ పండుగ సందర్భంగా మంజుల తన బ్రదర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.
‘మహేష్ స్టార్ హీరోగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ నా విషయంలో ఎప్పుడూ నాకు చాలా సపోర్టివ్ గా ఉంటాడు. అలాగే ఫ్యామిలీ పట్ల ఎంతో సెంటిమెంట్ గా ఉంటాడు. నేనెప్పుడు కాస్త లో గా ఫీలవుతున్న స్టేజ్ లో ఉన్నప్పుడు నేను మహేష్ కి కాల్ చేస్తాను. తనతో మాట్లాడితే తను చెప్పే మాటలు నాకు ఎంతో బూస్ట్ ఇస్తుందని’ మంజుల చెప్పింది.
మంజుల మహేష్ బాబు హీరోగా ‘అర్జున్’ అనే సిస్టర్ సెంటిమెంట్ సినిమా కూడా తీసింది.


